Go Back   Wiki NewForum | Latest Entertainment News > Television & Digital OTT Forums


Last Episode of Star Maa 'Koilamma'


Reply
Views: 6456  
Thread Tools Rate Thread Display Modes
  #1  
Old 09-18-2020, 04:13 PM
welcomewiki welcomewiki is offline
Member
 
Join Date: Dec 2008
Location: India
Posts: 82,195
Default Last Episode of Star Maa 'Koilamma'



Koilamma to go off-air tonight; Saikiran Ram and Tejaswini cherish their memorable journey

VIP users @ https://www.hotstar.com/in/tv/koilamma/10752
Normal users @ http://www.futurestorysofar.com

There are many daily soaps and then there is Koilamma, a one-of-its-kind musical drama on Telugu television with over 450 original compositions. The Telugu version of Bengali daily soap Potol Kumar Gaanwala (2015-2017) went on to push the bar higher by successfully completing a run of over 1000 episodes and more. The popular daily soap soon got a Malayalam version titled Vanambadi which was equally popular and successful. Along with Vanambadi, Koilamma is concluding tonight (September 18) and on the occasion, actors Saikiran Ram aka Manoj Kumar and Tejaswini Gowda aka Kokila tell ETimes-TV why it is their ‘most memorable show’ ever.

“I may do many shows in future but not something like Koilamma ever’ - this is what I told my team on the last day of shoot. My grandma and others also call me Chinni at home. So, Koilamma and Chinni will remain with me forever,” asserts Tejaswini with a sense of pride in her voice.




“When Vanambadi ended, I felt one half of mine is dead and now Koilamma has ended, too. I lived my character 'Manoj Kumar/Mohan' (in Vanambadi) for more than 25 days every month and for a good four and a half years. More than emotional, it is that pinch of an identity crisis. It is like Clark Kent can't be superman anymore. From those stylish walks to those kurtas and dhotis, I will miss Manoj Kumar,” said accomplished actor Sai Kiran Ram.

Tejaswini, who said she will miss her character and team, added that she had a heavy heart right from a few days ahead of the climax shoot. “There was this sequence where I had to say Vellosta (bye) to my close ones, I started crying then. I even shot for the climax songs well but I couldn't control my tears in the sequence where I took the award from my dad (Manoj). We all had a heavy heart while working on the last shoot schedule."

Both Tejaswini and Manoj share a great rapport both on and off-screen. Tejaswini calls Manoj 'Dadda' in real life and they didn't realise when and how they developed such a beautiful bonding. "He is a popular and successful actor and I've seen his (Sai Kiran) movies, too. Being a newbie, I was naturally apprehensive about talking to him but eventually we got closer. Now I feel I always had that warmth with Dadda," said Tejaswini. And Sai Kiran loves the same about their relationship. He said, "She is a very hardworking and sweet girl. I like how she owns people and makes them feel nice and comfortable. I will miss the special Dum Idli that she used to send me (laughs)."

Songs are something not just fans but the cast and crew of the show also love about the show. "Evarini..Nenavarini.." is one song that both Tejaswini and Saikiran love the most. "This is a show only K Raghavendra Rao garu and his team can do. It requires knowledge, taste, a strong will and conviction to produce and execute a TV show like this with over 450 songs. Krishnam Vande Jagadgurum, Madhurapuri, Evarini Nenevarini songs. I had a tough time in Vanambadi memorising the lyrics but not in Telugu," said Sai Kiran Ram.

Wishes are pouring in for both the actors and the entire team on the last day of telecast and talking about it, Tejaswini said, "I'm in a shoot right now but I'm quite excited and emotional, too, to interact with fans on social media as it's the last day. If I were the writer, I would have never ended the show now (laughs). But I was convinced with the ideology of our makers to end the show on a high without extending it for no reason. Audiences have owned Chinni and I wish I've the same love and support from them."

Recollecting a heartwarming message from a fan, Sai Kiran said, "I got emotional when an engineering student messaged me saying he is clueless as the show is ending because he used to watch Koilamma with his grandma during her last days. His grandma passed away recently but he continued to watch the show thinking she is there beside him. Now the show has ended, too. Then I've yet again realised that we might be transient but our work will remain forever."


Reply With Quote
  #2  
Old 09-18-2020, 04:20 PM
welcomewiki welcomewiki is offline
Member
 
Join Date: Dec 2008
Location: India
Posts: 82,195
Default

నేటితో ముగిసిన కోయిలమ్మ సీరియల్! కీరవాణి​​​, రాఘవేంద్రరావుల జడ్జ్*మెంట్! తండ్రీకూతుర్లు కంటతడిపెట్టించేశారు..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్*.. నేటితో ముగియనుంది. చిన్నీ కష్టాలు తీరి.. కన్నతండ్రి మనోజ్ కుమార్*ని ‘నాన్న’ అని పిలిచే సీన్ అయితే హైలెట్ అంతే. గుండెల్ని ద్రవింపచేసే ఈ ఎపిసోడ్ హైలైట్స్ టీవీ కంటే ముందుగా మీ కోసం..

ముగిసిన కోయిలమ్మ సీరియల్(photo courtesy by star మా and disney+ hotstar)

పుట్టుకే అవమానం. బతుకంతా భారం. నిత్యం కష్టాలే, కన్నీళ్లే.. అయితే ఏ రోజు సహనాన్ని కోలుపోని.. చిన్నీ(కోయిలమ్మ) తనవాళ్లంతా బాగుండాలనే ఎన్నో త్యాగాలకు సిద్ధపడి.. చివరికి గెలిసింది. ఏ శబథం చేసి తండ్రిని కలిసిందే అది నెరవేర్చుకుంది. తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణలో కొనసాగుతున్న కోయిలమ్మ సీరియల్*కి తెలుగు బుల్లితెర మీద.. ప్రత్యేక అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.

మ్యూజికల్ హిట్*గా నిలిచిన ఈ కోయిలమ్మ సీరియల్.. అసలు కథ ఏంటంటే... ఇద్దరు సంగీతకళాకారులకు పెళ్లి కాకుండా పుట్టిన చిన్నీ.. తండ్రి జాడ లేక.. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు పడింది. తీరా తండ్రిని కలుసుకుంటే.. సవతి తల్లి ఇంద్రజ పగబట్టింది. సవతి చెల్లెలు సింధూ విషం జిమ్మింది. సొంతవాళ్లంతా పరాయి వాళ్లు అయిపోయారు. కన్నతండ్రి మనోజ్ కుమార్ అసహించుకోవడంతో నరకం అనుభవించింది చిన్నీ. పెంచిన తండ్రి అశోక్* కుమార్, లక్ష్మీలకి కూడా దూరమైంది. చివరికి అదే సవతి తల్లి, సవతి చెల్లెలు కారణంగా భర్త అమర్*కీ దూరమైపోయింది. అత్తింటినీ వదిలి అనాథగా మారింది. బంధాలన్నీ పగబట్టి అవమానిస్తున్నా కన్నీళ్లతో ఓర్చుకున్న చిన్నీ.. చివరికి కన్నతండ్రికి చేరువైంది. సవతి తల్లి చేసిన కుట్రలన్నింటికీ తండ్రీ చరమగీతం పాడటంతో కథ సుఖాంతం అయ్యింది.

అసలు ఏం జరిగిదంటే..
చిన్నీ సవతి తల్లి ఇంద్రజ చేసిన కుట్రలు అన్నీ మనోజ్*కి తెలియడంతో.. మనోజ్ అంతా చక్కదిద్దడం స్టార్ట్ చేశాడు. చిన్నీ మీద అమర్*కి ఉన్న అనుమానం(అమర్ తమ్ముడు సమీర్*తో సంబంధం) పోగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి సమీర్ చిన్నీని.. తల్లిగా దత్తత తీసుకుని.. అమర్ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేశాడు. దాంతో అమర్ చిన్నీలు కలిసిపోయారు. చిన్నీ తన కన్నతల్లి కళ్యాణీకి ఇచ్చిన మాట ప్రకారం.. సంగీతరత్న పురస్కారమహోత్సవంలో తండ్రితోనే పోటీ పడుతూ ఫైనల్ రౌండ్*కి వచ్చింది.

చివరి ఎపిసోడ్* హైలైట్స్..(సెప్టెంబర్ 18)
ఇంద్రజ మనోజ్ కుమార్ కాళ్ల మీద పడి.. ‘నేను చాలా తప్పు చేశాను మనోజ్.. నన్ను క్షమించు’ అనడంతో.. అంతా నాకు తెలుసు.. అంటాడు. దాంతో ఇంద్రజ షాక్ అవుతుంది. సింధూతో ఇంద్రజ గతంలో మాట్లాడిన మాటలు అప్పట్లో రమేష్ చంద్ర(చిన్నీ మామగారు) వీడియో తీశాడు.. ఆ వీడియోనే ఇప్పుడు ఇంద్రజకు చూపిస్తాడు మనోజ్. దాంతో ఇంద్రజ ఏడుస్తూ.. ‘నేను ఏది చేసినా సింధూ కోసమే చేశాను మనోజ్.. చిన్నీ కూడా నా కూతురు లాంటిదే అని నేను అనుకోలేదు.. చివరిగా ఒకటే కోరిక మనోజ్.. చిన్నీ ప్రతి ఓటమికీ నేనే కారణం.. ఈ ఫైనల్స్*లో అయినా నువ్వే తనని గెలిపించు.. నా తప్పు నేను తెలుసుకున్నాను.. నువ్వు ఓడి చిన్నీని గెలిపించు మనోజ్’ అని చేతులెత్తి మొక్కడంతో ఇంద్రజలో మార్పు ప్రేక్షకుల్ని కూడా కంటతడి పెట్టిస్తుంది.

ఇక ఫైనల్ రౌండ్*లో చిన్నీని మించి మనోజ్, మనోజ్*ని మించి చిన్నీ అద్భుతంగా పాడతారు. అయితే మనోజ్ చిన్నీని స్టేజ్ మీద నిలబెట్టి.. ‘ఇప్పటి వరకూ నేను నా కూతురికి ఏం ఇవ్వలేదు. నా మీద గెలిచే అవకాశం ఇవ్వాలని ఉంది. తననే గెలిపించండి.. అమ్మా చిన్నీ నన్ను క్షమించమ్మా.. నీ తల్లికి చెప్పు.. నేను నాన్నని మించిన సింగర్*ని అయ్యానని నీ తల్లికి చెప్పు...’ అంటూ కంటతడి పెట్టడంతో.. చిన్నీ మనోజ్ గుండెలపై వాలిపోతూ.. ‘నాన్నా’ అనడం ప్రేక్షకుల హృదయాన్ని కలచివేసిందనే చెప్పుకోవాలి.
koilamma ending episode

మొత్తానికి కే రాఘవేంద్రరావుగారు, ఎం ఎం కీరవాణిలు జడ్జ్ చేసి.. ‘ఇద్దరూ అద్భుతంగా పాడారు. గెలుపు ఇద్దరిదీ’ అని చెప్పడంతో.. చిన్నీ, మనోజ్*లు బహుమతి అందుకుంటారు. తర్వాత ఇంద్రజ చిన్నీని ముద్దాడి.. తను చేసిన తప్పులకు క్షమాపణలు చెబుతుంది. మొత్తానికి కోయిలమ్మ సీరియల్ 868 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని నేటితో ముగిసింది. ఈ చివరి ఎపిసోడ్ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది.
Reply With Quote
Reply

Tags
Koilamma, South TV Shows, star plus, telugu

Latest News in Television & Digital OTT Forums


Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:



Powered by vBulletin® Version 3.8.10
Copyright ©2000 - 2020, vBulletin Solutions, Inc.